Header Banner

గోధుమ పిండితో ఇంట్లోకి ఎలుకలు రాకుండా చేయవచ్చు! ఎలాగో తెలుసా?

  Sun Feb 16, 2025 18:09        Life Style

ఎలుకల భయం అనేది ప్రతి ఇళ్లల్లో ఉంటుంది. ఎక్కడో మూలల్లో నక్కి ఇంటి మొత్తాన్ని నాశనం చేస్తుంటాయి ఎలుకలు. ఇక, వాటి మల వ్యర్థాల నుంచి వచ్చే వాసన చాలా భయంకరంగా ఉంటుంది. ఇక కర్మ కాలి.. ఎలుక చచ్చిపోతే.. ఆ వాసనను తట్టుకోవడం ఎవ్వరీ వల్ల కాదు. ఆ వాసనకు వాంతులు వస్తాయి. అంతేకాదు ఎలుకలు చేసే పనుల వల్ల తలనొప్పి వస్తుంది. ఒక్కోసారి అల్మారాలో ఉంచిన కొత్త బట్టల్ని పాడు చేస్తాయి. మనం తినే తిండిని కూడా వదలవు. ఒక్కోసారి డబ్బుల్ని కూడా నాశనం చేస్తాయి. అంతే కాదు ప్లేగు వంటి ప్రమాదకరమైన వ్యాధులు ఎలుకల వల్ల వస్తాయి. అందుకే వీటిని ఇంటి నుంచి తరిమికొట్టాలి. 

 

చాలా మంది ఎలుకల మందుతో వాటిని తరిమికొట్టడానికి ప్రయత్నిస్తారు. ఎలుకల మందుతో పాటు వివిధ రసాయనాలతో వాటి బెడద వదిలించుకోవాలనుకుంటారు. అయితే.. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఈ రసాయనాలు చాలా ప్రమాదం. పిల్లలకు తెలియకుండా రసాయనాల్ని, ఎలుకల మందును నోట్లో పెట్టుకునే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి టెన్షన్ లేకుండా.. ఎలుకల్ని తరిమికొట్టేందుకు కొన్ని ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. అందులో గోధుమ పిండి ఒకటి. గోధుమ పిండి ఉపయోగించి ఎలుకల్ని ఇంటి నుంచి తరిమికొట్టవచ్చు. ఎలానో ఇక్కడ తెలుసుకోండి. 

 

మొదటి చిట్కా కోసం కావాల్సిన పదార్థాలు
* పిసికిన పిండి
* బిర్యానీ ఆకులు
* టీ ఆకులు
* వంట సోడా
* డిటర్జెంట్ పౌడర్ 

 

​ఇంటి నుంచి ఎలుకలను తరిమికొట్టడానికి, ముందుగా గోధుమ పిండిని సాధారణ పద్ధతిలో పిసికి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బిర్యానీ ఆకులు, టీ ఆకులు, బేకింగ్ సోడా, డిటర్జెంట్ పౌడర్ వేసి కలపాలి. మీరు ఈ మిశ్రమాన్ని స్టఫింగ్‌గా ఉపయోగించాలి. పిండిని సన్నని ఉండలుగా చేసి, ఆ మిశ్రమాన్ని మధ్యలో ఉంచి బంతుల్లా చుట్టుకోవాలి. ఇలా పిండితో చిన్న చిన్న ఉండలను తయారు చేసి ఇంటి మూలల్లో ఉంచండి. లేదా ఎలుకలు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో ఉంచండి. ఈ ఘాటైన వాసనలు కలిగిన వస్తువులు ఎలుకలను ఇంటి నుంచి దూరంగా ఉంచుతాయి. అంతేకాకుండా వీటిని తిన్న తర్వాత వాటి ఘాటుకు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోతాయి. 

 

ఇది కూడా చదవండి: మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రెండో చిట్కా కోసం కావాల్సిన పదార్థాలు
* గోధుమ పిండి బంతి
* పొగాకు
* ఎండు మిర్చి
* దేశీ నెయ్యి 

 

మొదటి చిట్కాని ఫాలో అయినట్టే రెండో ట్రిక్ కూడా ఉపయోగించాలి. అయితే, ఇక్కడ పిండి మధ్యలో పెట్టే స్టఫింగ్ మాత్రమే మారుతుంది. పొగాకు, ఎండి మిర్చి పొడి, దేశీ నెయ్యిని బాగా కలపాలి. ఇప్పుడు పిండి మధ్యలో ఈ మిశ్రమాన్ని పెట్టి బంతుల్లా చుట్టుకోవాలి. మీరు ఈ బంతులను వేర్వేరు మూలల్లో ఉంచవచ్చు. నిజానికి, దేశీ నెయ్యి వాసన కారణంగా ఎలుకలు పిండి ముద్దల వైపు ఆకర్షణకు గురవుతాయి. ఇక, పొగాకు ఒక మత్తు పదార్థం. ఎండు మిర్చి ఘాటుగా ఉంటుంది. దీనిని తిన్న తర్వాత అవి ఇంటి నుండి వెళ్లిపోతాయి. 

 

పిండిలో ఘాటైన వాసనలు ఉన్న పదార్థాలు వాడటం మంచి ఆప్షన్. ఎలుకలను తరిమికొట్టడానికి ఎర్ర మిరపకాయ, పొగాకు, బే ఆకులతో పాటు, వెల్లుల్లి, పుదీనా లేదా యూకలిప్టస్ నూనెను కూడా ఉపయోగించవచ్చు . అన్ని వస్తువులను పిండి ముద్దలో ఉంచాలి. ఆ పిండి ముద్దల్ని ఇంటి మూలాల్లో లేదా ఎలుకలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఉంచాలి. వీటి దెబ్బకి ఎలుకలు ఇంటి నుంచి పారిపోతాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #LifeStyle #Rats #House #Home